విశాఖలో హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు ఆహార పరిశుభ్రత, నాణ్యత, భద్రతపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. త్వరలో శిక్షణా షెడ్యూల్ విడుదల చేసి, శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. ఈ శిక్షణ తప్పనిసరిగా పొందాలన్నారు.