జనగాం: యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై ప్రతి మండలంలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు యాప్‌పై అవగాహన కల్పించాలని, సాంకేతిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. యాప్‌తో యూరియా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.