VKB: తలకొండపల్లి మండల విద్యాధికారి (ఎంఈవో) వెంకట్ శుక్రవారం పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, విద్యార్థుల నోట్ పుస్తకాలు, వర్క్ బుక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, బోధనా తీరుపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మూడో తరగతి విద్యార్థులకు (FLS) పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.