ATR: కూడేరు మండలం అరవకూరులోని 80 మంది మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లను మంజూరు చేశారు. ఇవాళ అరవకూరు కమ్యూనిటీ హాల్ వద్ద స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ప్రత్యేక చొరవతో కుట్టు మిషన్లు లభించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.