‘Adipurush’ music director: ఎవరూ చేయని సాహసం చేసిన ‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్!
ప్రస్తుతం తిరుపతి అయోధ్యను తలపిస్తోంది. అడుగడుగునా ప్రభాస్ ఆదిపురుష్ కటౌట్సే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ పేరే జపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయని సాహసం చేశారు.
ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్, సాంగ్స్‌తో ఆదిపురుష్(Adipurush)పై భారీగా హైప్ క్రియేట్ అయింది. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ఆ రోజు థియేటర్లన్నీ రామమందిరాలుగా మారనున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఈజీగా వెయ్యి కోట్లు రాబట్టడం గ్యారెంటీ అంటున్నారు. అందుకే కనీవినీ ఎరుగని విధంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహిస్తున్నారు.
జూన్ 6 సాయంత్రం 5 గంటల నుంచి.. ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శీటి స్టేడియంలో చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్(Pre Release Event)కు రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ వేడుకకు కొన్ని వేల మంది అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండడంతో.. అందుకు తగ్గట్లుగానే సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇక ఈ సినిమా(Adipurush) మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్- అతుల్లో ఒకరు.. ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం చేశారు. దాంతో ఓ రోజు ముందుగానే ఈవెంట్ హడావిడి స్టార్ట్ అయిపోయింది.
అతుల్ ఏకంగా ముంబై నుంచి తిరుపతికి.. దాదాపు 1200 కిలో మీటర్లు రోడ్డు మార్గంలో బైక్ రైడ్ చేసి తిరుపతి చేరుకున్నారు. జూన్ మూడో తేదీన తన రైడ్‌ను మొదలు పెట్టి.. ఈవెంట్‌కి ఓ రోజు ముందే తిరుపతికి వచ్చేశాడు. ఆయనకు తిరుపతిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ప్రభాస్ అభిమానులు. అక్కడ శ్రీవారి దర్శనం చేసుకొని, ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో పాల్గొననున్నారు. ప్రస్తుతం అతుల్ బైక్ యాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండియాలోనే ఇలా చేసిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్‌గా అతుల్ నిలిచారు. ఇక ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. జై శ్రీరామ్, రామ్ సీతారామ్ సాంగ్స్ కు అజయ్- అతుల్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతమని ప్రశంసలు కురుస్తున్నాయి.