NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం సందర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రామస్థులతో సమావేశమై భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.