టాలీవుడ్ హీరో శర్వానంద్ (Hero Sharwanand)ఓ ఇంటివాడయ్యారు.
మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అంటూ ట్యాగ్ వేసుకుని తిరిగిన ఈ హీరో శనివారం రాత్రి 11 గంటలకు రక్షితా రెడ్డిని (Rakshita Reddy) వివాహం చేసుకున్నారు.
జైపూర్లోని లీలా ప్యాలెస్లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకి రెండు కుటుంబాలకు చెందినవారు, సన్నిహితులు, స్నేహితులు సహా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
రెండు రోజుల ముందు నుంచే లీలా ప్యాలెస్లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి వేడుకలు జరిగాయి.
పెళ్లి తర్వాత నూతన వధువరులకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.