MDK: లక్ష్యం గట్టిదైతే విజయం నీ బానిస అవుతుందని అమెరికాలోని ఫెయిర్ ఫ్యాక్స్ యూనివర్సిటీ డీన్, మోటివేటర్ డా. వీణ కొమ్మిడి అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ‘అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, లక్ష్యాలు, సాధన’ అంశాలపై ఆమె డిగ్రీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.