NZB: మోపల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బర్ల కాపరిపై సోమవారం చిరుత దాడి చేసింది. గాంధారి మండలం చిన్నగుట్ట తండాకు చెందిన అశోక్ గ్రామానికి చెందిన కేశవత్ యాదగిరి వద్ద పశువుల కాపరిగా రెండు సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే పశువులను అడవిలో మేతకు తీసుకువెళ్లగా ఒక్కసారిగా వచ్చిన చిరుతపులి అతడిపై వెనుక నుంచి దాడి చేసింది.