»Ntr Centenary Celebration Memorial Awards Event At Hyderabad
NTR: శతజయంతి వేడుక, మెమోరియల్ అవార్డ్స్
ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను విబి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను వి బి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్, ప్రభ, శివకృష్ణ, రోజా రమని, కవిత, తనికెళ్ల భరణి, బాబు మోహన్, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయిమాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బాసురేష్ కుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డా.గారపాటి లోకేశ్వరి, నందమూరి మోహనకృష్ణ, నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్, నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐజీ మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్, అనంతపురం జగన్, ‘మా’ ఈసీ మెంబర్ విష్ణు బొప్పన తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా ఏవి ఇన్ఫ్రాకన్, పవర్డ్ బై ఐమార్క్ డెవలపర్, అసోసియేటెడ్ స్పాన్సర్స్ వివి కే హౌసింగ్ ఇండియా, వండర్ డైమండ్స్, నావోకి, శ్రీయం ఐటి సొల్యూషన్స్, కేశినేని డెవలపర్, ఔట్‌డోర్ పార్టనర్ మీరా హార్డింగ్స్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు.
ఇవాళ్ల రేపు సినిమా అనేది లేదు..అంతా సర్కస్. విషాదకర పాటకు కూడా డాన్స్‌లు వేస్తున్నారని కోటా శ్రీనివాసరావు అన్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు కానీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2 కోట్లు, 6 కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారని తెలిపారు. ఇది మంచి పద్థతి కాదన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవితో డాన్స్ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయని అన్నారు.
అలాగే ‘మా’ అసోసియేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎంతమంది ఆర్టిస్ట్ రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోటా కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో ‘పది కోట్లతో సినిమా తీస్తే.. డబ్బు ఇవ్వద్దు. రాయితీలు ఇవ్వద్దు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్ క్లీన్ చేేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది?. దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’’ అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.