కడప: జిల్లా పూర్వ కలెక్టర్, ప్రస్తుత ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్‌కు అవార్డు లభించింది. జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు 2025 గ్రూప్-2 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి బహుమతి లభించింది. ఇందుకు ఈయన ఎంతగానో కృషి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు.