KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించారు. పోలింగ్ కేంద్రంలో మొదటి ఓటు వేసిన చెవుల మన్నెమ్మకు తహశీల్దార్, గ్రామ ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి, జోనల్ అధికారి సురేందర్, రిటర్నింగ్ అధికారి విజయపాల్ రెడ్డి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.