»Hyderabad Metro Rail Introduce Charges For Toilet Usage In Stations
Hyderabad Metro ప్రయాణికులకు షాక్.. మరో అదనపు ఛార్జీల భారం
మెట్రో వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. రైల్వే సేవలు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు చాలడం లేదు. ఇక ఉదయం, సాయంత్రం వేళలు కిక్కిరిసిపోతున్నాయి. కాగా, మెట్రో ప్రయాణికులకు ఒక బ్యాడ్ న్యూస్.
అత్యంత వేగంతోపాటు అత్యుత్తమ సేవలందిస్తూ హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro Rail) దేశంలోనే ప్రత్యేకతను చాటుతోంది. మెట్రో వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. రైల్వే సేవలు ప్రయాణికుల (Passengers) రద్దీకి తగ్గట్టు చాలడం లేదు. ఇక ఉదయం, సాయంత్రం వేళలు కిక్కిరిసిపోతున్నాయి. కాగా, మెట్రో ప్రయాణికులకు ఒక బ్యాడ్ న్యూస్. ఇకపై మెట్రో స్టేషన్లలో మరుగుదొడ్లు (Toilets) వినియోగించుకోవాలంటే డబ్బులు (Cash) చెల్లించాల్సిందే. ఈ మేరకు హెచ్ఎంఆర్ (HMR) ఓ ప్రకటన చేసింది.
మెట్రో స్టేషన్ (Metro Stations)లలో ఇన్నాళ్లు మరుగుదొడ్లు, టాయిలెట్లు ఉచితంగా వినియోగించుకునే వారు. శనివారం నుంచి వాటికి చార్జీలు (Charges) వసూలు చేయడం ప్రారంభించారు. ఒకటి, రెండుకు దేనికి వెళ్లినా రుసుము చెల్లించాలి. అయితే చార్జీలు మాత్రం నామమాత్రంగా విధించారు. టాయిలెట్ వాడకానికి రూ.5 నిర్ణయించగా.. మూత్రానికి రూ.2 వసూలు చేస్తున్నారు. కాగా, ఈ నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చార్జీలు అదనంగా ఉన్నాయని.. ఇప్పుడు మళ్లీ టాయిలెట్లకు కూడా చార్జీలు వసూలు చేయడం సరికాదని పేర్కొంటున్నారు.
మరికొందరేమో ఆర్టీసీని (TSRTC) చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతున్నా కూడా బస్టాండ్లలో ఉచితంగా (Free) మరుగుదొడ్లు వినియోగించుకునే అవకాశం కల్పించిందని గుర్తు చేస్తున్నారు. నిత్యం భారీగా ఆదాయం (Income) వస్తున్నా ఎందుకు చార్జీలు వసూలు చేయడం అని ప్రశ్నిస్తున్నారు. కాగా హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం దాదాపు 4 లక్షల మందికి పైగా మెట్రోను వినియోగిస్తున్నారు. ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాల్లో మెట్రో రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో లైన్ (Airport Express Metro Line) రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.