సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా 112 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రిషభ్ చౌహాన్ 47, రాహుల్ బాదమ్ (35*) పరుగులు చేశారు. ఆంధ్రా బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు.