TG: వేములవాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజుపై దాడి జరిగింది. ఇంటి దగ్గర కారు పార్కింగ్ చేస్తుండగా.. దుండగులు కత్తులతో దాడి చేసేందుకు యత్నించగా రాజు కేకలు వేయడంతో పారిపోయారు. రాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.