కృష్ణా: ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు, అక్రమ రవాణాను అరికట్టేందుకు మోపిదేవి టోల్ ప్లాజా వద్ద గురువారం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ పత్రాలు పరిశీలించారు. మద్యం తాగి డ్రైవ్ చేసిన వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు జారీ చేశారు.