PPM: PGRS వినతులను పరిష్కారం చేయడంలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన జిల్లా అధికారులను కలెక్టర్ అభినందించారు. గురువారం కలెక్టరేట్లో PGRS వినతులపై జిల్లా అధికారులతో సమీక్షించారు. సమస్యలు పరిష్కారమైన తర్వాత మరలా పునఃప్రారంభం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.