ప్రస్తుతం ఎక్కడ చూసిన అవతార్ 2 గురించే చర్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో అవతార్ 2 థియేటర్స్ లిస్ట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. స్క్రీన్స్‌తోనే అవతార్ 2 రికార్డు వేట మొదలైందని అంటున్నారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పండోరా గ్రహం. అయితే ఈ సారి పండోరా నుంచి వాటర్లోకి తీసుకెళ్లబోతున్నాడు జేమ్స్ కామెరూన్. ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఆల్ టైం రికార్డు నెంబర్ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 2009లో అవతార్ మూవీని పది వేలకి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు దానికి ఐదు రెట్లు రికార్డుతో అవతార్2 రిలీజ్ కాబోతుంది. మొత్తంగా 52000 వేల స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారట. దాంతో అవతార్2.. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం రికార్డులను బ్రేక్ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 3’ రిలీజ్ డేట్ లాక్ చేసేశారు. రెండేళ్లకోసారి అవతార్ సీక్వెల్స్ రిలీజ్ చేస్తానని గతంలోనే చెప్పారు. దాంతో అవతార్ 2 ప్రమోషన్లో భాగంగా.. 2024 డిసెంబర్ 20న ‘అవతార్ 3’ రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. మిగతా పార్ట్స్ కూడా ఇదే సీజన్లో రిలీజ్ అవుతాయని అన్నారు. కానీ పార్ట్ 2, 3 హిట్ అయితేనే మిగతా సీక్వెల్స్ ఉంటాయని అన్నారు. అయితే మరికొన్ని గంటల్లో అవతార్ 2 రిజల్ట్ తెలిసిపోనుంది. కాబట్టి.. సీక్వెల్స్ ఉంటాయా.. లేదా.. అనేది కూడా తేలిపోతుందని చెప్పొచ్చు.