Beer Sales: మే నెలలో ఎండలు దంచికొట్టాయి. హై టెంపరేచర్ నమోదవడంతో జనం బయటకు వెళ్లలేని సిచుయేషన్. ఇంకేముంది కొందరు చల్లన ఇంటిపట్టున ఉండి బీర్ కొట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మే నెలలో 7.44 కోట్ల బీర్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
ఎండలు.. దానికితోడు పెళ్లిళ్లు, ఫంక్షన్లు కూడా జరిగాయి. దీంతో బీర్ల సేల్స్ (Beer Sales) పెరిగాయి. 2019 మే నెలలో 7.2 కోట్ల బీర్ల అమ్మకాలు జరగగా.. ఈ సారి ఆ రికార్డు బ్రేక్ చేశారు. మే నెలలో బీర్లతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3285 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం ఒక్కరోజే రూ.300 కోట్ల బీర్ల కొనుగోలు జరిగాయట. మే నెలలో 64,48, 469 లక్షల కేసుల బీర్ల (Beer) అమ్మకాలు జరగగా 30,66,167 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. బుధవారం 2,55,526 లక్షల కేసుల బీర్లు (Beer), 3,31,961 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది మే నెలలో 55,72,000 లక్షల కేసుల బీర్ల (Beer) విక్రయాలు జరగగా.. 27,11,000 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి.
రాష్ట్రంలో మొత్తం 2620 వైన్ షాపులు ఉన్నాయి. వెయ్యికి పైగా బార్లు, క్లబ్లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. దీంతో రూ.100 నుంచి రూ.150 కోట్ల మద్యం విక్రయం జరుగుతోంది. 2022-23 ఏడాది 35,145.10 కోట్ల విలువైన 3.52 కోట్ల లిక్కర్ కేసులు.. 4.79 కోట్ల బీర్ (Beer) కేసుల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.