VSP: ఈనెల 12న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి బుధవారం సమీక్షించారు. భద్రత, రవాణా, వీఐపీ రూట్ మ్యాప్, వేదిక ఏర్పాట్లు, ప్రజా నిర్వహణపై అధికారులతో కలిసి స్థలాన్ని సందర్శించి సూచనలు జారీ చేశారు. పర్యటనను నిరాటంకంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.