MDK: తూప్రాన్ మండలంలో బుధవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అనుమతించిన ఇసుకను అక్రమంగా సేకరించి, రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. తూప్రాన్ వద్ద ఎస్సై శివానందం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా.. మెదక్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.