ASF: జిల్లాలో తొలి విడత ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. జిల్లాలోని 5 మండలాల్లోని 114 సర్పంచ్, 944 వార్డు స్థానాలకు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ బాక్సులను ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలకు తరలించే ప్రక్రియ చేపట్టినట్లు ఆయన వివరించారు.