MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలకు ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి, మంగళవారం సాయంత్రం అధికారులు గుర్తులు కేటాయించారు. బుధవారం జిల్లా కేంద్రం నుంచి ట్రంకు పెట్టెలను వాహనంలో బాలానగర్ ఎంపీడీవో కార్యాలయానికి తరలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని ఈ పెట్టెల్లో భద్రపరుస్తారు.