పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13 వేల కోట్ల మేర వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ మోసగించిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న చోక్సీకి ఈ కేసులో బెల్జియం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను అప్పగించాలన్న భారత దేశ అభ్యర్థనను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.