SRCL: ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేష్ వి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.