KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం మధిరలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మధిర చేరుకోనున్న ఆయన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 3నుంచి 5గంటల వరకు పార్టీ నాయకులు, ప్రజలతో సమావేశం కానున్న భట్టి అనంతరం హైదరాబాద్ బయలుదేరతారు.