ATP: ఎస్కే యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశా అని పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ తెలిపారు. గుత్తిలోని ఎమ్మెస్ డిగ్రీ కళాశాలలో ఒకరిని, హిందూపురం బాలాజీ విద్యా మందిరంలో ఒకరిని కాపీయింగ్ చేస్తూ గుర్తించి డిబార్ చేశామని ఆయన ఇవాళ ప్రకటనలో పేర్కొన్నారు.