NLG; దేవరకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మైదానంలో డిసెంబర్ 20న 10 నుంచి 16 ఏళ్ల లోపు బాల బాలికలకు జిల్లాస్థాయి అథ్లెటిక్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 100 మీటర్, 800 మీటర్, షాట్ పుట్ వంటి వివిధ ఈవెంట్లలో పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలకు శిక్షణ ఇస్తారని ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు.