కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఆదివారం జరిగిన రెండవ రాష్ట్ర స్థాయి ఓపన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు జరిగాయి. ఈ కరాటే పోటీలకు వివిధ జిల్లాల నుంచి 800 మంది పోటీలో పాల్గొన్నారు. ఇందులో హుజూరాబాద్‌కు చెందిన 6 గురు గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్ సాధించినట్లు బీబీఆర్ కరాటే ఆకాడమీ డైరక్టర్ భూసారపు బాబురావు తెలిపారు. విద్యార్థులను ప్రజా ప్రతినిధులు అభినందించారు.