RR: శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తామహబూబ్ పేటలో ఆక్రమణలను తొలగించి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సోమవారం కాపాడింది. 5 ఎకరాల మేర మక్తా మహబూబ్ కుంటను కబ్జా చేసేయాలనే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. కబ్జాల చెర నుంచి కాపాడిన 5 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.