GDWL: గద్వాల నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ధరూర్ మండలంలోని నెట్టెంపాడు, నాగర్ దొడ్డి, మాల్ దొడ్డి, గార్లపాడు గ్రామాల్లో పర్యటించి ఆయన మద్దతుదారుల తరపున ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని ముంపు గ్రామాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.