NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి పని చేసే నాయకులకు ఓటు వేయాలని, నిజమైన ప్రజా సేవకులను ఎన్నుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర లోక శక్తుల అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు.