GNTR: టీడీపీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రత్తిపాడు నియోజకవర్గ, మండల స్థాయి నేతల శిక్షణా తరగతుల కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ ఎనలేని కృషి చేసిందని కొనియాడారు.