W.G: పెనుగొండ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆయాలకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలంటూ పెనుగొండ MRO కార్యాలయం వద్ద ఇవాళ CITU నాయకులు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారికి సరైన వేతనం లేదంటూ ఎమ్మార్వో అనితకు వినతిపత్రం అందచేశారు.