గత కొంత కాలంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను టార్గెట్ చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల రక్షణ కోసం సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ మధ్యవర్తులు చెప్పే లాభాల గణాంకాలను స్వతంత్రంగా ధృవీకరించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ‘పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్’ ఏజెన్సీని ఆవిష్కరించింది.