తిరుపతి: ఓజిలి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ వాతలు తేలేలా కొట్టిన ఘటన తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణ్‌ను సస్పెండ్ చేస్తూ AP ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.