KKD: ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్‌గా నియమితులైన సౌమ్య సోమవారం MLA వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రిలో రోగులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి చేస్తామని సౌమ్య హామీ ఇచ్చారని పేర్కొన్నారు.