TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సదస్సుకు హాజరయ్యారు. సినీ నటుడు నాగార్జును కూడా గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్నారు.