TG: గ్లోబల్ సమ్మిట్‌కు ఢిల్లీ పవర్ కార్పొరేషన్ డైరెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌర, పవన విద్యుత్‌లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిపారు. ప్రజల అవసరాల మేరకు విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.