NZB: చందూర్ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో ఏకగ్రీవమైన 9వ వార్డు సభ్యుడు పోతరాజు పోశెట్టికి సోమవారం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరెడ్డి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ వార్డులో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ మద్దతుదారుడు విత్ డ్రా చేసుకోవడంతో ఏకగ్రీవమైంది. ఇక గ్రామంలో మిగిలిన 13 వార్డులు, సర్పంచ్ స్థానానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి.