WNP: గోపాల్పేట మండల పరిధిలోని ప్రజలకు సోమవారం ఎస్సై నరేష్ కుమార్ హెచ్చరిక జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియా గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు, రాజకీయ విద్వేషాలు సృష్టించే పోస్టులు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యతగా ఉండాలని కోరారు.