TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మికే దిక్కులేదని అన్నారు. ‘కోటి మంది అక్కాచెల్లెల్లలో ప్రతీ ఒక్కరికి రూ.60 వేలు బాకీ పడ్డారు. మీ పాలనలో ఆత్మహత్యలు, మర్డర్లు, అత్యాచారాలు పెరిగాయి. అందాల పోటీలు పెట్టి పరువు తీశారు. పోటీ నుంచి మధ్యలోనే తప్పుకుని మిస్ ఇంగ్లండ్ వెళ్లిపోయారు’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.