TG: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్పలం, నిరర్ధకం అని పేర్కొన్నారు. ‘ప్రజాభవన్‌ను జల్సాలు, విందులు, వినోదాలకు వేదికగా మార్చారు. కేసీఆర్ ప్రారంభించిన స్కీములన్నీ అటకెక్కించారు. మీ పాలనలో జరిగిందల్లా ఆర్గనైజ్డ్ కరప్షన్. ప్రతి స్కీంలోనూ స్కాం ఉంది’ అని విమర్శించారు.