MNCL: ఎన్నికల విధులను ప్రిసైడింగ్ అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ అధికారులు సూచించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల విధులకు నియమితులై శిక్షణకు రాని సిబ్బందికి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించారు.