W.G: వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల పాలకొల్లు నియోజకవర్గం వ్యాప్తంగా పొగ మంచు, చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున రహదారులు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, చిరు వ్యాపారస్థులు, నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు రాలేకపోయారు. చలి వల్ల వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోస వ్యాధి గ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు.