KDP: ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఆదివారం రాత్రి గౌరు సుజాత (42) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సుజాతను భర్త రవిశంకర్ రెడ్డి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. క్లూస్ టీమ్ వచ్చి పరిశీలించారు. త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.