AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో 4.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మినములూరులో 7 డిగ్రీలు, పాడేరులో 9 డిగ్రీలు, చింతపల్లిలో 10.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.