తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని (Telangana Formation Day) పురస్కరించుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (State Road Transport Corporation) శుభవార్త తెలిపింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది అందరికీ మరోసారి కరువు భత్యం (Dearness Allowance) చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ (TSRTC) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Goverdhan), ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) శుభవార్త ప్రకటనను విడుదల చేశారు.
జూలై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను (DA) మంజూరు చేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏ ఉద్యోగులకు చెల్లిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. సంస్థ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సంక్షేమమే (Welfare) పరమావధిగా పని చేస్తున్నట్లు తెలిపారు.
‘తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో (Sakala Janula Samme) పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల (Decade Celebrations) కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది’ అని చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్…
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) June 1, 2023