విశాఖ వన్డేలో భారత్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 54 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, జైస్వాల్ 40 పరుగులతో రోహిత్‌కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. దీంతో, 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేసింది. విజయానికి ఇంకా మరో 169 పరుగులు చేయాల్సి ఉంది.