VSP: నిరుద్యోగ యువత కోసం గాజువాకలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. డిసెంబర్ 12న ఉదయం 9 గంటలకు గాజువాకలోని శ్రీనగర్‌లోని టి.ఎస్.ఆర్ అండ్ టి.బి.కె డిగ్రీ కాలేజ్ వద్ద ఈ మేళాను గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.